ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత షట్లర్లు పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి తొలి రౌండ్లోనే టోర్నీ నుండి నిష్క్రమించారు. తాజాగా ఈ భారత జోడీ 21-23, 12-21తో మలేసియా జోడీ ఆరోన్ తై-కాంగ్ ఖై జింగ్ చేతిలో పరాజయం చెందింది. ప్రయాణ సమస్యలతో ఈ టోర్నీకి స్టార్ షట్లర్ సింధు దూరం కాగా సాత్విక్ జోడీ, లక్ష్యసేన్ పైనే భారత్ అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. ఇక పురుషుల సింగిల్స్ లో ప్రపంచ నంబర్‌వన్ షి యుకిని ఓడించి లక్ష్యసేన్ భారత్ కు శుభారంభం అందించాడు.సాత్విక్, చిరాగ్ తీవ్రంగా నిరాశపరిచారు. పురుషుల సింగిల్స్ లో ఆయుష్ శెట్టి 21-19, 9-21, 17-21తో ఇండొనేసియాకు చెందిన ఫర్హాన్ చేతిలో పరాజయంతో టోర్నీ నుండి నిష్క్రమించాడు.