టీ 20 వరల్డ్ కప్ 2026: మరోసారి విశ్వ విజేతగా భారత్… ఫైనల్లో న్యూజిలాండ్ పై ఘన విజయం

Spread the love

ప్రపంచ టీ 20 క్రికెట్ లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. భారత బ్యాటర్ల విధ్వంసంతో నరేంద్ర మోదీ స్టేడియం దద్దరిల్లింది! అశేష భారత్ క్రికెట్ అభిమానుల మధ్య మెన్ ఇన్ బ్లూ సత్తా చాటింది.
ఫైనల్ లో న్యూజిలాండ్ పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి వరుసగా రెండో సారి మొత్తంగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. మైదానంలోకి అడుగుపెట్టడంతోనే కివీస్ బౌలర్లపై ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ విరుచుకుపడ్డారు. పవర్ ప్లేలోనే భారత డామినేషన్ షురూ చేశారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఇక ఆఖర్లో శివమ్ దూబే మెరుపులతో భారత్ భారీ స్కోరు చేసింది.
అనంతరం టార్గెట్ ఛేజింగ్ లో న్యూజిలాండ్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కట్టడి చేస్తూ భారీ విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌటయింది. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించిన భారత్ విశ్వ విజేతగా సత్తా చాటింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు అదిరిపోయే స్టార్ట్ లభించింది. భారత ఓపెనర్లు సంజు శామ్సన్ (89), అభిషేక్ శర్మ 52 (21; 6×4, 3×6) ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పవర్‌ ప్లేలోనే రికార్డు స్థాయిలో 92 పరుగులు రాబట్టి ప్రత్యర్థికి చుక్కలు చూపించారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 54 (25; 4×4, 4×6) అర్ధసెంచరీతో మెరవగా, చివర్లో శివం దూబే 26 (8; 3×4, 2×6) తనదైన శైలిలో సిక్సర్ల వర్షం కురిపించి స్కోరును 250 దాటించారు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఫైనల్ మ్యాచ్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. కివీస్ బౌలర్లు భారత బ్యాటర్ల ధాటికి బెంబేలెత్తిపోయారు.
భారత బ్యాటింగ్:
సంజూ శాంసన్ 89 (46; 5×4, 8×6), అభిషేక్ శర్మ 52 (21; 6×4, 3×6), ఇషాన్ కిషన్ 54 (25; 4×4, 4×6), హార్థిక్ పాండ్య 18 (13; 1×4, 1×6), సూర్య కుమార్ యాదవ్ 0 (1), తిలక్ వర్మ 8 నాటౌట్ (6), శివమ్ దూబే నాటౌట్ 26 (8; 3×4, 2×6).
ఎక్స్ ట్రా రన్స్:8
మొత్తం:255-5 (20 ఓవర్లు).
న్యూజిలాండ్ బౌలింగ్:
మాట్ హెన్రీ 4-0-49-1, గ్లెన్ ఫిలిప్స్ 1-0-5-0, జాకబ్ డఫ్ఫీ 3-0-42-0, లాకీ ఫెర్గూసన్ 2-0-48-0, మిచెల్ శాంట్నర్ 4-0-33-0, రచిన్ రవీంద్ర 2-0-32-1, జేమ్స్ నీషమ్ 4-0-46-3.

న్యూజిలాండ్ బ్యాటింగ్:
టిమ్ సీఫర్ట్ 52 (26; 2×4, 5×6), ఫిన్ అలెన్ 9 (7; 1×4),రచిన్ రవీంద్ర 1 (2), గ్లెన్ ఫిలిప్స్ 5 (5; 1×4), మార్క్ చాప్ మన్ 3 (8),
డారిల్ మిచెల్ 17 (11; 2×4), మిచెల్ శాంట్నర్ 43 (35; 3×4, 2×6), జేమ్స్ నీషమ్ 8 (7; 1×4), మాట్ హెన్రీ 0 (1), లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫ్ఫీ
ఎక్స్ ట్రా రన్స్: 12
మొత్తం: 159-10 (19 ఓవర్లు).

భారత బౌలింగ్:

అర్ష్ దీప్ సింగ్ 4-0-32-0, హార్దిక్ పాండ్య 4-0-36-1, అక్సర్ పటేల్ 3-0-27-3, జస్ప్రీత్ బుమ్రా 4-0-15-4, వరుణ్ చక్రవర్తి 3-0-39-1, అభిషేక్ శర్మ 1-0-5-1. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *