వారణాసి ప్రీ-రిలీజ్ బిసినెస్ చూసి ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే

Spread the love

వారణాసి… ఇప్పడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంత ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు…దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ సినిమానే ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌గా మారింది. ఈ సినిమాను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తుండగా, తాజాగా బయటకు వస్తున్న వివరాలు ఆ అంచనాలను మరింత పెంచుతున్నాయి. భారీ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా  కథానాయికగా నటిస్తుండటం మరో ప్రత్యేకతగా మారింది. అదే సమయంలో మలయాళ స్టార్ హీరోపృథ్వీరాజ్ సుకుమారన్  ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారని తెలిసిందే కదా. ఇక ఈ భారీ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాపై ఏర్పడిన డిమాండ్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఒక సినిమా పూర్తి అవ్వడానికి దగ్గరగా వచ్చినప్పుడు లేదా ప్రమోషన్స్ బలంగా ప్రారంభమైన తర్వాతే భారీ బిజినెస్ జరుగుతుంది. కానీ వారణాసి విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతుండగానే విదేశీ మార్కెట్‌లో భారీ ఆఫర్లు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ ఇంటర్నేషనల్ పంపిణీ సంస్థ Phars Films ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 160 కోట్ల రూపాయల భారీ ఆఫర్ ఇచ్చిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం అన్ని భారతీయ భాషల హక్కులను కలిపి ఇచ్చిన ఆఫర్ అని తెలుస్తోంది. ఒక సినిమా ఓవర్సీస్ రైట్స్‌కు ఇంత పెద్ద మొత్తం రావడం నిజంగా ఒక రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా ప్రమోషన్స్ కూడా పూర్తిగా మొదలుకాకముందే ఇంత పెద్ద స్థాయి బిజినెస్ జరగడం మరింత విశేషంగా మారింది. ఈ భారీ ఆఫర్ల వెనుక ప్రధాన కారణం దర్శకుడు రాజమౌళి సాధించిన గత విజయాలే అని చెప్పాలి. ఆయన తెరకెక్కించిన బాహుబలి 1&2, RRR సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా RRR సినిమాతో భారతీయ సినిమా పేరు అంతర్జాతీయ వేదికపై మరింత గొప్పగా వినిపించింది. ఆ సినిమాకు వచ్చిన అవార్డులు, ప్రశంసలు రాజమౌళి పేరు గ్లోబల్ స్థాయిలో నిలిపాయి. అందుకే ఆయన తదుపరి సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న మహేష్ బాబు కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన స్టార్. ఆయనకు ఉన్న క్రేజ్, రాజమౌళి బ్రాండ్ విలువ కలిసి ఈ సినిమాకు మరింత బలం చేకూర్చుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా ప్రత్యేకమైన ప్రదేశాల్లో కొనసాగుతోంది. చిత్రబృందం సాహసోపేతమైన లొకేషన్లను ఎంపిక చేసుకుని అక్కడ చిత్రీకరణ జరుపుతోంది. ఇలాంటి అరుదైన లొకేషన్లలో సినిమాను చిత్రీకరించడం ద్వారా ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వాలని దర్శకుడు రాజమౌళి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అందుకే సినిమా విడుదలకు ముందే మార్కెట్‌లో ఇంత పెద్ద డిమాండ్ ఏర్పడుతోంది. కేవలం ఓవర్సీస్ హక్కుల ద్వారానే 160 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందంటే, సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందో ఊహించుకోవచ్చు. ఇంకా థియేట్రికల్ హక్కులు, శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు వంటి ఇతర బిజినెస్‌లు కూడా రాబోయే రోజుల్లో పెద్ద సంచలనాలకు కారణం కావచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రమోషన్స్ పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ఈ సినిమాకు వచ్చే బిజినెస్ సంఖ్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం వారణాసి సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ విజయంగా నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో ఇది భారతీయ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే అవకాశమూ ఉందని వారు భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే, రాజమౌళి – మహేష్ బాబు కలయికలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక సినిమా విడుదలయ్యే సమయానికి ఈ అంచనాలు మరింత ఎత్తుకు చేరే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *