తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ భారత ఆటగాళ్ల హవా కొనసాగించారు. అలాగే టీమ్ ర్యాంకింగ్స్ లో కూడా భారత్ మంచి స్థానంలో నిలిచింది. టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్ 105 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. 126 పాయింట్లతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. 119 పాయింట్లతో సౌతాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతోంది. 106 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. 102 పాయింట్లతో ఇంగ్లాండ్ ఐదో స్థానంలో ఉంది. ఇక వన్డే టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్ 116 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 109 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో, 103 పాయింట్లతో వరుసగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలు మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ 100 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక టీ 20 ర్యాంకింగ్స్ లో కూడా భారత్ అగ్రస్థానంలోనే ఉంది. 268 పాయింట్లతో ఇంగ్లాండ్, 260 పాయింట్లతో ఆస్ట్రేలియా, 247 పాయింట్లతో న్యూజిలాండ్, 243 పాయింట్లతో సౌతాఫ్రికా వరుసగా రెండు, మూడు, నాలుగు,ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఇక మెన్స్ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 861 పాయింట్లతో ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. భారత్ నుండి రిషబ్ పంత్ 713 పాయింట్లతో 7వ స్థానంలో నిలవగా, శుభ్ మాన్ గిల్ 709 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. యశస్వీ జైస్వాల్ 697 పాయింట్లతో 11వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక వన్డేల్లో శుభ్ మాన్ గిల్ 801 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ 767 పాయింట్లతో 3వ స్థానంలో, రోహిత్ శర్మ 758 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచి సత్తా చాటారు. శ్రేయాస్ అయ్యర్ 12, కే.ఎల్.రాహుల్ 17వ స్థానంలో కొనసాగుతున్నారు. టీ 20లలో కూడా భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఇషాన్ కిషన్ 913 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా..అభిషేక్ శర్మ 862 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తిలక్ వర్మ 748 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. సూర్య కుమార్ యాదవ్ 640 పాయింట్లతో 20వ స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో టెస్టులలో జస్ప్రీత్ బుమ్రా 853 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. మిచెల్ స్టార్క్ 872 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 714 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ నుండి కుల్దీప్ యాదవ్ 10వ స్థానంలో నిలిచాడు. టీ 20 ర్యాంకింగ్స్ లో కూడా రషీద్ ఖాన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ నుండి వరుణ్ చక్రవర్తి 5వ స్థానంలో నిలిచాడు. బుమ్రా 10వ స్థానంలో నిలిచాడు. టెస్టు ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. వన్డేలలో ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు అజమాతుల్లా ఒమర్జాయ్, టీ 20లలో జింబాబ్వే ఆటగాడు సికిందర్ మొదటి స్థానాల్లో కొనసాగుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో మన భారత్ ఆధిపత్యం తిరుగులేకుండా సాగుతోందని స్పష్టమవుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో భారత ఆటగాళ్ళు అత్యుత్తమ ప్రదర్శనతో సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ తమ సత్తా ఏంటో ప్రపంచానికి మరోసారి చాటి చెప్పారు. వ్యక్తిగత ర్యాంకింగ్స్‌తో పాటు, టీమ్ ర్యాంకింగ్స్‌లోనూ భారత్ రెండు ఫార్మాట్ లలో అగ్ర స్థానాల్లో పాతుకుపోయింది. భారత ఆటగాళ్లు సాధించిన ఈ అద్భుత విజయంపై దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు, విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.