నెల్లూరు జిల్లా కావలి డిఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే శ్రీధర్ దుమ్ముదులుపుతున్నారు. మత్తు పదార్థాల, అసాంఘిక కార్యకలాలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా కావలి రూరల్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్, తుఫాన్ నగర్, బాలకృష్ణ రెడ్డి నగర్ ప్రాంతాలలో డీఎస్పీ శ్రీధర్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద ఇళ్లల్లో తనిఖీ చేసి, అనుమానం ఉన్న వ్యక్తులను విచారించి సరైన పత్రాలు లేని 40 బైకులు, మూడు ఆటోలను సీజ్ చేశారు. గంజాయి, సారాయి, మత్తుపదార్ధాల నియంత్రణతో పాటు కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారేమో అని తనిఖీ చేశాని డీఎస్పీ తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశామన్నారు. ఈ కార్డెన్ సెర్చ్ లో 88 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.