మెగా9 వెబ్ డెస్క్ :టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కెందుకు రెడీ అవుతుంది. కీర్తి సురేష్ చాలాకాలంగా తన స్నేహితుడు ఆంటోనీ తటీల్ తో ప్రేమలో ఉందంట. కానీ ఎక్కడ ఆ విషయం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుందని టాక్ నడుస్తుంది. అంటోని దుబాయ్ లో ప్రముఖ వ్యాపారవేత్త అంటూ సమాచారం. అయితే కీర్తి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కొచ్చికి చెందిన వాడు కావడం విశేషం. కీర్తి సురేష్ డిసెంబర్ 11 – 12 తేదీలలో గోవాలో ఆంటోనీ తటిల్ తో నటి కీర్తి సురేష్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనుంది అని ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ కీర్తి మ్యారేజ్ గురించి మాత్రం కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. మరి కీర్తి సురేష్, ఆమె కుటుంబ సభ్యులు ఈ పెళ్లి వార్తలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.