చంద్రబాబు లడ్డూ స్కెచ్ అందుకే-అసలు రీజన్ చెప్పిన వైసీపీ ఎమ్మెల్సీ ..!

ఇటీవల వచ్చిన వరదలకు అమరావతి తడిసి ముద్దయిందని, అక్కడ రాజధాని నిర్మాణానికి అవకాశం లేదని, దీనిని పక్కదోవ పట్టించడానికి సీఎం చంద్రబాబు కొత్తరకం పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డులో కలిపే నెయ్యి జంతువుల కొవ్వు నుండి తీసిన నూనె అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది పచ్చి అబద్ధమని, ముఖ్యమంత్రి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ స్కెచ్ వేశారని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదు అంటున్న పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి