దొంగ యాత్రలతో చేసిన జగన్ చేసిన పాపాలు పోవని టీడీపీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. పాపాలన్నీ చేసి యాత్రలు, దర్శనాలు చేసుకుంటే ప్రాయశ్చితం అయిపోతాయా అని ప్రశ్నించారు. జగన్ చేసింది మాములు పాపం కాదు.. కలియుగ వైకుంఠస్వామికే ద్రోహం చేశారన్నారు. జగన్ పాలనలో తిరుమల ఆలయంలో చేయకూడని అపచారాలన్నీ చేశారని జీవీ విమర్శించారు. దేవుడంటే నమ్మకం లేని నాస్తికులు, అన్యమతస్తులు, దొంగల చేతుల్లో పాలకమండలిని పెట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్‌రెడ్డి చేయాల్సింది యాత్రలు కాదు, తప్పు ఒప్పుకోవడం అన్నారు. అయిదేళ్లుగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని తిరుమలలో దోపిడీ చేశారని, తిరుమల వెళ్తే ఈసారైనా డిక్లరేషన్‌పై సంతకం చేయడం మరిచిపోకండి జగన్ అన్నారు…