నాని బర్త్ డే..జీవితమంతా రుణపడి ఉంటా..శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్  

Spread the love

దశాబ్దంకు పైగా తనదైన సహజ నటనతో ఎన్నో విజయవంతమైన చిత్రాలతో విలక్షణ పాత్రతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు నేచురల్ స్టార్ నాని. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఆయన తాజాగా నటిస్తున్న ‘ప్యారడైజ్’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా నాని బర్త్ డే సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ ను పెట్టారు. 

నాని అన్న,నువ్వు “నీ ఇష్టం శ్రీకాంత్” అని అన్న ప్రతిసారీ, నాకు అది “నిన్ను నమ్ముతున్నాను శ్రీకాంత్” అన్నట్టే వినిపిస్తుంది.ఆ నమ్మకం నన్ను ప్రతి క్షణం భయపెడుతుంటుంది… ‘ది ప్యారడైజ్’ కోసం నా రక్తాన్ని, ఆత్మని ధారపోయాలనే తపనను కలిగిస్తుంది.సినిమా విషయంలో నీకున్న ప్రతి రూల్‌ని నేను బ్రేక్ చేశాను.నీ వర్కింగ్ డేస్ ప్యాటర్న్‌ని బ్రేక్ చేశాను…నీ రిలీజ్ డేట్ స్ట్రీక్‌ని బ్రేక్ చేశాను…నీ వర్కింగ్ స్టైల్‌ని బ్రేక్ చేశాను…సినిమా మేకింగ్‌లో నీకున్న దాదాపు ప్రతి పద్ధతినీ నేను మార్చేశాను.నేను నిన్ను బ్రేక్ చేసిన ప్రతిసారీ, నువ్వు నన్ను కొత్తగా నిర్మించావు అన్న. ఈరోజు నాకున్నదంతా నువ్వు ఇచ్చిందే. నువ్వు నమ్మినంతగా నన్ను ఈ ప్రపంచంలో ఎవరూ నమ్మలేదు అన్న.నిన్ను జడలు వేసుకోమన్నాను… “సరే రా, నీ ఇష్టం” అన్నావు.లెక్కలేనన్ని రీటేక్స్‌తో నిన్ను ప్రతిరోజూ టార్చర్ పెడుతుంటాను… అప్పుడూ నువ్వు కేవలం “సరే రా, నీ ఇష్టం” అనే అంటావు.ఈ మాట నీకు ఎప్పుడూ నేరుగా చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను అన్న.నువ్వు ఎప్పుడూ “నీ ఇష్టం శ్రీకాంత్” అని ఎందుకు అంటావో తెలుసుకోవాలనే ఆరాటంలోనే నా జీవితంలోని ప్రతి క్షణాన్ని గడుపుతున్నాను.బహుశా, ఆ సమాధానం నా సబ్-కాన్షస్‌లో ‘ది ప్యారడైజ్’ ద్వారా నాకు దొరుకుతుందేమో. నన్ను నమ్మిన నా ధరణికి,నన్ను మళ్ళీ నమ్ముతున్న నా జడల్-కి…పుట్టినరోజు శుభాకాంక్షలు నాని అన్న.జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. అంటూ శ్రీకాంత్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక వీరిద్దరి కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘దసరా’ కూడా ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ‘ప్యారడైజ్’ మూవీ 2026 ఆగష్టు 21న విడుదల కానుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *