సనాతన బోర్డు ఏర్పాటు కోసం అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద హిందు సమాజం ప్రతినిధులు ఇవాళ కొబ్బరికాయలు కొట్టి ముక్కులు చెల్లించుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ముందుకు రావడం హర్షణీయమని వారు తెలిపారు. ముస్లింలకు వక్స్ బోర్డ్ ఉన్నట్లే హిందువుల కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. సనాతన బోర్డు ఏర్పాటుతో హిందు దేవాలయాలు, ఆస్తుల పరిరక్షణకు దోహదం చేస్తుందన్నారు. హిందు ధర్మ పరిరక్షణ కోసం పవన్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు. జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దర్శనానికి అనుమతించాలన్నారు.