మెగా9 వెబ్ డెస్క్ : బన్నీ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పుష్ప – 2 ట్రైలర్ ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుంది. యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో దూసుకుపోతున్న పుష్ప 2 ట్రైలర్ చూసి మూవీ టీం సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసింది.
ఇందులో భాగంగా, తాజాగా పుష్ప 2 ట్రైలర్ చూశాక “అద్భుతంగా ఉంది” అంటూ పుష్ప మూవీ టీం ని అభినందించారు లిరికిస్ట్ చంద్రబోస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో ఫోటో దిగారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ “వైల్డ్ ఫైర్” అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో చంద్రబోస్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలో నటించారు.