పోలవరం డీఎస్పీ ఆఫీసులో ఏలూరు ఐజీ- ఏం జరుగుతోంది ?

ఏలూరు రేంజ్ ఐజీ జి వి జి అశోక్ కుమార్ ఇవాళ పోలవరం డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసు ప్రాంగణాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతం గురించి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల్ని త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఆఫీసు రికార్డుల్ని పరిశీలించారు. పోలవరం గ్రామాల్లో మావోయిస్టుల కదలికలు లేవని ఐజీ అశోక్ తెలిపారు. మహిళలపై కేసులు, పోక్సో కేసులు,, గంజాయి అక్రమ రవాణాపై దృష్టిసారించారన్నారు. ఏలూరు రేంజ్ వ్యాప్తంగా సైబర్ క్రైమ్ నివారణ కొరకు ప్రజలకు సైబర్ క్రైమ్ జరిగే విధానం గురించి, ఎవరైనా సైబర్ క్రైమ్ కు గురైతే వెంటనే 1930 కు తెలియచేయాలని ఇప్పటికే ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న అన్ని జిల్లాలలో అవగాహన సదస్సులను నిర్వహిస్తూ వీడియోలను ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.