మెగాస్టార్ ఎయిర్ పోర్టు ఎపిసోడ్ ను ఏదో చేద్దామని ఇంకేదో అయిన ఫేక్ బ్యాచ్…
ఈ మధ్య పారిస్ టూర్ కు కుటుంబ సమేతంగా వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈ సందర్బంగా ఎయిర్ పోర్టులో తనతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ అభిమానిని పక్కకు నెట్టేసి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎయిర్ పోర్టులో ఏం జరిగిందనేది ఎలాగో వీడియోనే అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని పరిశీలిస్తే అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది. కానీ సోషల్ మీడియాలో కొందరు అదే పనిగా సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిని నెట్టేసి వెళ్లిపోయారంటూ చిరును ట్రోల్స్ చేస్తున్నారు. దీన్ని పట్టుకుని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పాపం కిందా మీదా పడుతోంది. అయితే ఈ ఎపిసోడ్ లో మెగాస్టార్ తప్పుందా..? ఫేక్ బ్యాచ్ చేస్తున్న రాద్ధాంతం లో అసలు విషయం ఏమైనా ఉందా..? తెలుసుకోవాలనుకుంటే వాచ్ దిస్ స్టోరీ..
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిని మెగాస్టార్ చిరంజీవి పక్కకు నెట్టేసి వెళ్లిపోయారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కాసేపు ఇందులో మరో కోణం మాట్లాడుకుందాం. సపోజ్ అక్కడ చిరంజీవి కాకుండా మరో సాధారణ వ్యక్తి లేదా ఓ మోస్తరు టాలీవుడ్ నటులో ఇలాగే అభిమానిని పక్కకు తప్పించి వెళ్లిపోయి ఉంటే ఈ రేంజ్ లో ట్రోలింగ్ లు, చెత్తరాతలు కనిపించేవా ? లేదు అక్కడ మరో టాలీవుడ్ యాక్టర్ ఉండి ఉంటే ఈ స్దాయిలో విమర్శలు చేసే వారా అంటే సమాధానం దొరకదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కడైనా నెగిటివ్ కనబడితే పండగ చేసుకుందాం అనుకునే ఒక బ్యాచ్ మాత్రం గోతికాడ నక్కల్లా వేచి చేస్తూ ఉంటుంది. ఆ బ్యాచ్ ఇప్పుడు మెగాస్టార్ వీడియోను చూసి పండగ చేసుకుందాం అనుకుంది. తీరా మెగా ఫ్యాన్స్ దెబ్బకు తోక ముడిచి పారిపోయింది.
ఎంతో బడలిక తో ఉన్న సమయంలో పదే పదే అడ్డుపడుతుంటే ఎవరైనా ఏం చేస్తారు..? ఇంకెవరైనా అయితే కాస్తంత రూడ్ గానే వ్యవహరించేవారు. కానీ పక్కకు వెళ్ళమ్మా అన్నట్టు చిరంజీవి చేసిన గెశ్చర్ కి ఇంకేదో హంగులు, రంగులు అద్దాలని చూసిన ఫేక్ బ్యాచ్ చివరకు అభాసుపాలైంది. సరే ఇవన్నీ కాదు..ఆ తేడా బ్యాచ్ ట్రోల్స్ గురించే మాట్లాడుకున్నా.. మెగాస్టార్ చిరంజీవి తన అభిమానిని తానే పక్కకు నెట్టేసి వెళ్లిపోయారనే కాసేపు అనుకుందాం. మరి సదరు అభిమాని కదా స్పందించి ఆవేదన వ్యక్తం చేయాలి. తన అభిమాన హీరో సెల్ఫీ కోసం వెళ్తే తోసేశారని బాధపడాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఈ వీడియో తీసుకున్న వారో, దాన్ని షేర్ చేసి కామెంట్లు చేసే వారో, ట్రోలింగ్స్ చేసుకునే వారో ఎందుకు బాధపడటం. ఈ లెక్కన ప్రతీ హీరోనూ ఇలాగే ఫాలో అవుతూ వారు ఎవరిని పక్కకు నెట్టి వెళ్లిపోయినా ఇలాగే విమర్శలు చేస్తారా అంటే ఎవడి దగ్గర నుంచి సమాధానం ఉండదు.
అలాగే ఈ ఎపిసోడ్ లో మరో కోణం కూడా చూడాల్సి ఉంటుంది. ఎంత మెగాస్టార్ అయినా ఆయన కూడా ఓ సగటు మనిషే కదా. ఎక్కడో దేశ విదేశాల నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి నగరానికి చేరుకుని ఇంటికి వెళ్లే హడావిడిలో ఉంటే మధ్యలో సెల్ఫీ పేరుతో ఓ అభిమాని విసిగిస్తే కిమ్మనకుండా సెల్ఫీ ఇచ్చే వెళ్లాలా ? దేశంలో ప్రతీ సెలబ్రిటీ ఇలాగే అభిమానులకు సెల్ఫీలు ఇచ్చాకే ఇంటికి వెళ్తున్నారా ? ఇలా అసలు పని మానేసి సెల్ఫీ అడిగిన ప్రతీ ఒక్కరికీ కాసేపు ఆగి నచ్చజెప్పి వెళ్లే పరిస్దితి ఉంటుందా అంటే జవాబులు దొరకవు. మరి సెలబ్రిటీ అన్న ఏకైక కారణంతో చిరును ట్రోలింగ్ చేస్తున్న వారంతా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయాలు ఇవే. కాబట్టి మెగాస్టార్ పై బురద జల్లాలనే ప్రయత్నంలో ఆకాశం పై ఉమ్మేయాలని చూస్తే తర్వాత ఏం జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు.