సింహాద్రి అప్పన్న లడ్డు నాణ్యతపైఅనుమానాలున్నాయి..

సింహాచలం సింహాద్రి అప్పన్న లడ్డు ప్రసాదం నాణ్యత పై భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం అన్నప్రసాదం కేంద్రం లో ఉన్న స్టోర్ ని సందర్శించారు. అన్నదానం లడ్డు ప్రసాదం పులిహార కి వాడే సరుకులను పరిశీలించారు . సందర్భంగా ఆయన నెయ్యి నాణ్యత పై పలు సరుకులు నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో 650 రూపాయలు పైబడి ఉన్న ఆవునెయ్యిని ఉత్తరప్రదేశ్ కి చెందిన సంస్థ 385 ఎలా సరఫరా చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు.