హిందువైతే రెడ్డి.. క్రిస్టియన్ అయితే జగన్-అలిపిరిలో సాధువుల డిమాండ్…!

తిరుమలకు జగన్ పర్యటన రద్దు నేపథ్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద సాధువులు, హిందూ సమాజం సభ్యులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. జగన్, నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా, అలాగే హిందూ మతాన్ని కూడా గౌరవిస్తానంటే హిందువులను అగౌరపరిచినట్లే అన్నారు. జగన్మోహన్ రెడ్డి హిందువు అయితే రెడ్డి అని పెట్టుకోవాలని, క్రిస్టియన్ అయితే జగన్ అని పెట్టుకోవాలని,లేదంటే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు శ్రీ వెంకటేశ్వర స్వామి విజయమని తెలిపారు. జగన్ ఎప్పుడు తిరుమలకు వచ్చిన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి, డిక్లరేషన్ ఇస్తేనే ఆయనను తిరుమలకు అనుమతిస్తామని లేదంటే ఎప్పటికీ వ్యతిరేకిస్తామని తెలిపారు.