అదరగొట్టిన భారత పారా ఆర్చర్ లు

Spread the love

భారత్ స్వదేశంలో జరిగిన పారా ఆర్చరీ ఈవెంట్ ను ఘనంగా ముగించింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన అంతర్జాతీయ పారా ఆర్చరీ పోటీల్లో భారత్‌ మొత్తం 15 పతకాలను సాధించి అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. మొత్తంగా 15 మెడల్స్ సాధించింది. అందులో 4 గోల్డ్ మెడల్స్, 4సిల్వర్ మెడల్స్, 8 బ్రాంజ్ మెడల్స్ తో అదరగొట్టింది. ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్ స్టేజ్-3లో చివరి రోజు భారత్ ఖాతాలో రెండు గోల్డ్ మెడల్స్ తో పాటు 4 బ్రాంజ్ మెడల్స్ చేరాయి. కాంపౌండ్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి గోల్డ్ సాధించింది. షూటాఫ్ కు ఫైనల్లో శీతల్ కజకిస్థాన్ ఆర్చర్ ఐజాదా సీడన్ పై  విజయం సాధించింది. స్కోర్లు 144-144తో సమం కావడంతో షూటాఫ్ తప్పలేదు.  అందులో శీతల్ 10 పాయింట్లు సాధించింది.  ఐజాదా 9 పాయింట్లు సాధించింది. పారాలింపిక్స్ చాంపియన్ హర్విందర్ సింగ్, భావన జోడీ రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో గోల్డ్ గెలిచారు. ఫైనల్లో ఈ జోడీ 6-0తో చైనా క్రీడాకారులు లియాంగ్, జియాలపై గెలిచారు. ఇక శీతల్.. తోమన్ కుమార్ లు కాంపౌండ్ మిక్స్ డ్ ఈవెంట్లో బ్రాంజ్ గెలిచారు. భావన రికర్వ్ కాంస్య పోరులో భారత్ కు  చెందిన రాజశ్రీ రాథోడ్ పై గెలిచారు. ఇదే విభాగంలో సరిత కూడా కంచు పతకం గెలిచింది. తోమన్ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో బ్రాంజ్ గెలిచాడు. ఈ విజయాలు భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ పతకాలకు బాటలు వేస్తాయని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. అసాధారణ ప్రతిభావంతులైన ఈ అథ్లెట్ల ప్రదర్శన రాబోయే ఒలింపిక్స్ మరియు ఇతర అంతర్జాతీయ టోర్నీలపై అంచనాలను పెంచుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *