ఆందోళన చెంద వద్దంటున్న ఎంపీ భరత్ గాజువాక ,శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి దయనీయంగా మారిందని. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందవద్దని కార్మిక సంఘ నాయకులకు కార్మికులకు విశాఖ ఎంపీ భరత్ , గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు భరోసా ఇవ్వడం జరిగింది.1311 రోజుల నుంచి కూర్మన్నపాలెంలో మీరే రిలే నిరాహార దీక్షలో చేస్తున్న కార్మిక సంఘాలకు కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో చర్చించామని స్టీల్ ప్లాంట్ సంబంధించి ఆర్థిక వనరులు ఇచ్చే విధంగా చర్చలు జరిపామని ఎంపీ భరత్ ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ గాని మూసే పరిస్థితి గానీ వస్తే గనక స్టీల్ ప్లాంట్ గురించి మా యొక్క పదవులను రాజీనామా చేస్తామని రిలే నిరాహార దీక్షలో ప్రకటించిన గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు. గత ప్రభుత్వంలో జరిగిన విధంగా కాకుండా గత ఆరు నెలలుగా కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో స్టీల్ ప్లాంట్ ఉందని. స్టీల్ ప్లాంట్ ని ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం ఇటు కేంద్రానికి చెప్పి చేయాలని. అదేవిధంగా డైరెక్టర్ స్టీల్ ప్లాంట్ నష్టాలపాట ప్రయాణించడానికి గల కారణం ఈ ఒక్క డైరెక్టర్ అని అలాగే పాత స్టీల్ ప్లాంట్ సిఎండి అత్తిలి బట్ బొగ్గు కుంభకోణంలో ప్రధాన సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని. స్టీల్ ప్లాంట్ నష్టపోవడానికి కారణమని ఈ సభాముఖంగా విశాఖ ఎంపీ భరత్ , పల్లా శ్రీనివాసరావు స్టీల్ సిఐటియు అయోధ్య రామయ్య తెలియపరిచారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్న 3000 మందిన విధుల నుంచి తొలగించాలని.పర్మినెంట్ ఎంప్లాయిస్ ని 2000 మందిని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని. 500 పర్మినెంట్ కార్మికులను వేరే కర్మగారాలకి పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నారని. విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు గత నాలుగు నెలల నుంచి శాలరీ తీసుకో లేకుండా ఇబ్బంది పడుతున్నారని అలాగే పర్మినెంట్ ఎంప్లాయిస్ కూడా ప్రతి నెల మొదటి తారీఖున రావలసిన శాలరీలు ఇప్పటిదాకా రాలేదని దానికి ఇలాంటి వ్యవహార శైలిని వెంటనే ఆపి స్టీల్ ప్లాంట్ ను త్వరితగతిన బ్లాస్ట్ ఫర్నిచర్ లో రన్ చేసి లాభాల బాట పెట్టాలని సుమారుగా ఉన్న ఐరన్ ఓర్ మెటీరియల్తో ఒక బ్లాస్ట్ ఫర్నిచర్ రన్ చేస్తే 90 కోట్లు పైన వస్తాయని కానీ అందులో 900 కోట్లు ఓన్లీ రా మెటీరియల్ ఖర్చు అవ్వగా మిగిలిన 100 కోట్లతో కార్మికులకు శాలరీలు ఇవ్వచ్చని ఏ ఐ టి యు సి ఆదినారాయణ మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది.