ఇక చాలు..మీకొక నమస్కారం అంటున్న పవన్ పై గెలిచిన ఆ ఎమ్మెల్యే..?

ఉమ్మడి పశ్చిమలో ఆ నేత రూటే సెపరేటు. తమపార్టీ అధికారంలో ఉండగా దురుసుగా వ్యవహరించి నోరు పారేసుకున్న ఆ నేత. ఇక నాకిక రాజకీయాలొద్దని అంటున్నారట. పార్టీ పవర్ లో లేకపోవటమో లేక ప్రత్యర్ధుల సంఖ్య పెరగటమో కానీ ఆ మాజీ ఇక రాజీపడాల్సిందేనని సన్నిహితులతో చెబుతున్నారట. ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు..? రాజకీయాలకు ఎందుకు గుడ్ బై చెప్పబోతున్నారో తెలుసా..? అయితే ఈ స్టోరీ చూసేయండి  మరి.

భీమవరం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో పొలిటికల్ హీరోగా మారారు. ఎందుకంటే ఆయన గెలిచింది ఆషామాషీ వ్యక్తిపై కాదు..పవర్ స్టార్ గా అశేషఅభిమానులను కలిగి ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఆయన గెలవడంతో ఒక్కసారిగా రాష్ట్రంలోనే గ్రంధి శ్రీనివాస్ పేరు మార్మోగింది. దీంతో ఆపార్టీ అధినేత జగన్ దగ్గర కూడా మంచిమార్కులే కొట్టేసారాయన. కానీ పదవుల దగ్గరకొచ్చేసరిగి ప్రతిసారీ భంగపాటే ఎదురైంది గ్రంథి శ్రీనివాస్ కి.  రెండుసార్లు జరిగిన మంత్రివర్గ విస్తరణలో అవకాశమొస్తుందని ఆయన భావించారు. కానీ అదేమీ జరగలేదు..ఓదశలో ఆయన జనసేనలో జాయినవ్వుతారన్న చర్చ కూడా జరిగింది. అయితే పార్టీ పెద్దల నుండి బుజ్జగింపులు జరిగేసరికి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారన్న గుసగుసలు అప్పట్లో భీమవరం సందుల్లో వినిపించేవి. దీంతో ఆయన ఎమ్మెల్యే గా ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసేందుకు , ఆయనకు కౌంటర్లిచ్చేందుకు వైసీపీ అధిష్టానం పూర్తిస్థాయిలో గ్రంథిని వినియోగించుకుంది. పవన్ పాలసీలపైనా…కాపు సామాజికవర్గం గురించి మాట్లాడినపుడు గ్రంథి తీవ్రస్థాయిలోనే కౌంటర్లిచ్చేవారు..జనసైనికుల ఆగ్రహానికి గురయ్యేవారు.

అంతేకాదు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం వచ్చిన ప్రతిసారి గ్రంధి శ్రీనివాస్ విలేకరుల సమావేశం పెట్టి మళ్లీ భీమవరంలో పవనే పోటీ చేయాలి.. అతని మీద నేనే నెగ్గుతాను అని సవాళ్లు విసిరిన సందర్భాలు సైతం ఉన్నాయి. అలాగే పవన్ కూడా గ్రంధి శ్రీనివాస్ పై తీవ్రస్థాయిలోనే విరుచుకుపడేవారు.  రౌడీ యుజం చేయాలని చూస్తే తాటతీస్తానంటూ హెచ్చరించేవారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా..తాను తలచింది ఒకటైతే జరిగింది మరొకటి కావటంతో గత ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. ఆయనపై జనసేన అభ్యర్ధి  పులపర్తి ఆంజనేయులు గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులు 2014లో టిడిపి నుంచి గెలుపొందినప్పటికీ 2019 లో ఓటమి తర్వాత ఎక్కడా కనబడలేదు. తిరిగి 2024లో టిడిపి నుంచి టికెట్ ఆశించి బంగపడిన ఆయన, జనసేన పార్టీలో చేరి టికెట్ తెచ్చుకొని అక్కడి నుంచి గెలుపొందారు..

ఇక పులవర్తి ఆంజనేయులు గెలుపుతో పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గం వర్గం మీద ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం ఫోకస్ పెట్టారు. ఇకనుంచి గ్రంధి శ్రీనివాస్ కు చెక్ పెడతారని నియోజకవర్గంలో రాజకీయంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.. లోకేష్ యువగళం పాదయాత్ర భీమవరం నియోజకవర్గం దాటే సమయంలో గ్రంధి శ్రీనివాస్ తన అనుచరులతో టిడిపి వాలంటీర్లు పైన రాళ్లదాడి దాడి చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి… 50 మంది టిడిపి వాలంటీర్ల పైన కేసులు పెట్టి భీమవరం నియోజకవర్గంలోని ఓ పోలీస్ స్టేషన్లో రోజంతా వారిని ఇబ్బంది పెట్టారని విమర్శలు సైతం ఉన్నాయి. అందుకోసమని నారా లోకేష్ దగ్గర ఉన్న రెడ్ బుక్ లో భీమవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పేరు కూడా ఎక్కిందని టిడిపి వర్గాలు అంటున్నాయి…దీంతో పార్టీ పెద్దల మెప్పు కోసం విరుచుకుపడిన ఆయన, ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని.. పైగా ఇప్పుడు ఓటమితో ప్రత్యర్థి పార్టీ వారికి మెయిన్ టార్గెట్ గా అయిపోయారని గ్రంధి కోటరీ తెగ ఫీలయిపోతోందట. ఇటువంటి పరిస్థితుల్లో గ్రంధి శ్రీనివాస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యచందంగా మారిందట. దీంతో  గ్రంథి తన పొలిటికల్ రిటైర్మెంట్ కి దగ్గర పడ్డారన్న గుసగుసలు భీమవరంలో రీసౌండిస్తున్నాయట. అంతేకాదు.. టిడిపి. జనసేనలతోనే కాక బిజెపితో కూడా గ్రంథికి వైరం ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు . ఎందుకంటే భీమవరం నియోజకవర్గంలో నరసాపురం పార్లమెంట్ బిజెపి ఎంపీ శ్రీనివాస్ వర్మ పైన కూడా గ్రంధి శ్రీనివాస్ అప్పట్లో నోరేసుపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

దీంతో ఆయన ఇప్పుడు కేంద్రమంత్రి అయ్యారు. ఇంకేముంది…తన చుట్టూ ప్రత్యర్ధులు మోహరించి ఉండటంతో రాజకీయంగా ఊపిరిఆడని పరిస్థితులున్నాయి.  దీంతో మూడు పార్టీలకు టార్గెట్ అయిన స్థానిక వైసీపీ కార్యక్రమలకు సైతం గ్రంథీ దూరంగా ఉంటున్నారు. మరి ఈ  పరిస్థితుల్లో గ్రంథి శ్రీనివాస్ రాజకీయంగా కొనసాగుతారా లేక ఇక్కడితో ఇకచాలని పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటారా అనేది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ అవుతోంది. మరి ఆయన నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి.