మెగా9 వెబ్ డెస్క్ : టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత టీవీ యాడ్స్ లో కూడా యాడ్ చేసిందని మీకు తెలుసా ? అవును నిజమే సమంత కెరియర్ తొలినాళ్లలో చేసిన వాణిజ్య ప్రకటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో సమంత బ్యూటీ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేస్తుంది. ఎల్లో కలర్ డ్రెస్సులు నవ్వుతూ డాన్స్ చేస్తూ కనిపించింది.
అయితే ఈ వీడియోలో సమంతను చూసిన అభిమానులు అసలు గుర్తుపట్టలేకపోతున్నారు. సమంత అప్పటికంటే ఇప్పుడే యాంగ్ గా కనిపిస్తుంది.. తాను సమంతనే అని పోల్చుకోవడానికి చాలా కష్టంగా ఉంది అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే నిజంగా తాను సమంతాయేనా? అని ఆశ్చర్యపోతున్నారు. వయసు పెరిగేకొద్దీ శరీరంలో, ముఖంలో మార్పులు సహజమే అని అభిమానులు అంటుంటే కొందరు మాత్రం తన ఫేస్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ చేయించుకున్నట్లుగా ఉంది అంటూ సెటేర్లు వేస్తున్నారు.