ఏలూరు బస్టాండ్ శుభ్రం చేసిన జడ్పీ ఛైర్ పర్సన్-కారణమిదే..!

ఏలూరు కొత్త బస్ స్టాండ్, జిల్లా పరిషత్ ఆవరణలో “స్వచ్ఛత హి సేవ 2024” కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీపురు పట్టుకొని బస్ స్టాండ్ పరిసరాలని శుభ్రపరిచారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా సప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా చేపట్టినట్లు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు