కాంగ్రెస్ ప్రభుత్వపు మరొక తుగ్లక్ నిర్ణయం ఇది:కె.టి.ఆర్ 

Spread the love

టన్నుకు రూ. 3,800 అయ్యే సింగరేణి బొగ్గుకు “వద్దు” అని చెప్తారు,టన్నుకు రూ.9,000 అయ్యే విదేశీ బొగ్గు దిగుమతికి మాత్రం “సరే” అంటారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కె.టి.ఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వపు మరొక తుగ్లక్ నిర్ణయం ఇది అంటూ కె.టి.ఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.  ఎవరి లబ్ధి కోసం ఇదంతా చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు ఈ భారాన్ని ఎందుకు మోయాలి? అని ప్రశ్నించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు నిల్వలు తెలంగాణలో ఉన్నాయి; ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలకు బొగ్గును సరఫరా చేసే సింగరేణి కాలరీస్ మన వద్ద ఉంది. కేసీఆర్ ప్రభుత్వ 9.5 ఏళ్ల పాలనలో, సింగరేణి బొగ్గు సహాయంతో టీఎస్ జెన్‌కో (TS GENCO) ఉత్పత్తి చేసిన విద్యుత్‌తోనే తాము  24/7 నిరంతర విద్యుత్ సరఫరాను అందించినట్లు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *