మెగా9 వెబ్ డెస్క్ : తెలంగాణలో అధికారం కోల్పోయాక పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్.. మాజీ సీఎం కెసిఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో కారు డ్రైవింగ్ చేస్తూ సందడి చేశారు. ఆయన డ్రైవింగ్ చేస్తున్న కారులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డిని కూర్చోబెట్టుకున్నారు. ఇద్దరూ కలిసి పంట పొలాలను పరిశీలించారు.
ఫామ్ హౌస్ లో జారిపడి తుంటి ఎముక విరగడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకున్న కేసీఆర్.. కోలుకున్న తర్వాత ఫామ్ హౌస్ లో మారుతి వ్యాన్ నడిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి కెసిఆర్ బెంజ్ కారు డ్రైవింగ్ చేశారు. చాలాకాలం తర్వాత ఇప్పుడు కేసీఆర్ బయటకు రావడంతో బీఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కెసిఆర్ కార్ డ్రైవింగ్ చేసే ఫోటోలను గులాబీ నేతలు షేర్ చేస్తున్నారు.