కొడాలి నిర్వాకంపై పవన్ ఫైర్-బాటిల్ చూపిస్తూ మరీ..!

గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్న ఎమ్మెల్యే రామును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు వవన్ తెలిపారు. రాష్ట్రస్థాయి పల్లె పండుగ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల నీటి సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యే రాము తీసుకెళ్లారు. నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్ మండలాల్లోనీ 43 గ్రామాల్లో ప్రజల త్రాగునీటి కష్టాలపై పవన్ కళ్యాణ్ కు వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో ప్రజలు తాగుతున్న నీటిని…. బాటిల్ ద్వారా పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే చూపించారు. దీంతో బాటిల్స్ తీసుకున్న పవన్.. రంగు మారి మలినాలతో ఉన్న నీటిని గుడివాడలోని 43 గ్రామాల ప్రజలు తాగుతున్నారన్నారు. తిట్ల పురాణాలు శాపనార్ధాలు తప్ప ప్రజల కష్టాలు పట్టించుకున్నారా అంటూ మాజీ మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.