చంద్రబాబు ఆ బిరుదు వెనక్కి ఇచ్చేయాలి-వైసీపీ మాజీ మంత్రి వేణు..!

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని వైసీపీ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో 82 లక్షల టన్నుల ఇసుక దోపిడీ చేశారని ఆయన విమర్శించారు. బాబు సిగ్నల్ ఇచ్చారు ఇసుక దోపిడీకి లారీ ఇసుక రూ.60 వేలకు వచ్చిందన్నారు. ఈ దోపిడీపై విచారణ జరిపించాలన్నారు. కేవలం 2 రోజులోనే ఇసుక టెండర్లు పూర్తి చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.ఇసుక పాలసీ రద్దు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. దీనిపై పవన్ కూడా స్పందించాలన్నారు. అలాగే పర్సంటేజ్ ఇస్తేనే మద్యం వ్యాపారం చేయనిస్తాం అంటున్నారని, మందు ఇవ్వడమే నేరం, క్వాలిటీ మద్యమా పవన్ ఆలోచించాలన్నారు. అలాగే బాబు విజనరీ పదాన్ని ఉపసంహరించుకోవాలని వేణు డిమాండ్ చేశారు.