చంద్రబాబు లైట్ తీసుకున్నా, మేం వదిలిపెట్టం-షర్మిల వార్నింగ్..!

చంద్రబాబు తిరుమల లడ్డుపై సీఎం చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పినట్లు ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎసస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఇది చిన్న విషయం కాదని, సెంటిమెంట్ తో కూడిన అంశమన్నారు. ఈ విషయం ఇప్పుడే ఎందుకు బయట పెట్టారని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. దీని తీవ్రత ఆయనకు ముందే తెలుసా, తెలిస్తే ఎందుకు ప్రజలకు చెప్పలేదని అడిగారు. చంద్రబాబు 100 రోజుల పాలనపై ప్రజల అసంతృప్తి గమనించే, దాన్ని డైవర్ట్ చేసేందుకే ఇప్పుడు దీన్ని తెరపైకి తెచ్చారా అని ప్రశ్నించారు. మీరు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా, తాము మాత్రం లైట్ తీసుకోబోమన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రికి లేఖ రాస్తామన్నారు. అలాగే గవర్నర్ నూ కలుస్తామన్నారు.