జగన్ అప్పుడు మాంసం కూడా ముట్టరు-చెవిరెడ్డి సంచలనం..!

తిరుమల టూర్ రద్దు విషయంలో వైసీపీ అధినేత జగన్ పై వస్తున్న విమర్శలను ఆ పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుబట్టారు. గతంలో జగన్ 3680 మెట్లు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని గుర్తుచేశారు. ఆయన తిరుమలకు వచ్చే రోజు మాంసం కూడా ముట్టరని తెలిపారు. తండ్రి రాజశేఖరరెడ్డి చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం పిండ ప్రధానం చేశారని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డికి దేవుడంటే భక్తి భావన ఎక్కువన్నారు. ఇంట్లోనే గోశాలను నిర్మించుకొని, గోవులకు పూజాలు నిర్వహిస్తున్నారని, అదే గోవుకు పుట్టిన దూడకు మహాలక్ష్మి అనే నామకరణం చేశారని గుర్తుచేసారు. అలాంటి వ్యక్తి తిరుమల వస్తుంటే అడ్డుకున్నారన్నారు.