జగన్ ను అడ్డుకోవడానికి మేం చాలు-తిరుపతి బీజేపీ నేతల వార్నింగ్..!

జగన్ కు స్వామి వారి అనుగ్రహం లేదని, స్వామి వారి ఆశీర్వాదం లేనందునే జగన్ కు దర్శనం కాలేదని తిరుపతి బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు ఎందుకు ఇబ్బందని ఆయన ప్రశ్నించారు. జగన్ పులివెందులకు శాసన సభ్యుడు మాత్రమే..ఎందుకు అంత అహంకారం అన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో దళితులను రాకుండా అడ్డుకున్నామా అని జగన్ ను ప్రశ్నించారు. కుల మతాలను రాజకీయాల్లోకి లాగద్దొన్నారు. జగన్ అడ్డుకోవడానికి తిరుపతిలో బీజేపీ నాయకులే చాలన్నారు. జగన్ రెడ్డే కల్తీ రెడ్డి అని మరో బీజేపీ నేత కోలా అనంద్ విమర్శించారు. జగన్ మాటలే బుద్ధి లేని మాటలన్నారు.