ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మకు ఈరోజు ఆలయ సిబ్బంది పవిత్రమైన ఆషాడ సారె సమర్పించారు. ప్రతి ఏడాదీ ఆచారంగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని సిబ్బంది ఈ ఏడాది కూడా కొనసాగించారు. ఆలయ వైదిక సిబ్బందితో పాటు పరిపాలనా సిబ్బంది మొత్తం కుటుంబసభ్యులతో కలిసి కనకదుర్గ నగర్ నుంచి ఊరేగింపుగా రాగా.. ఆలయ ఈవో కేఎస్ రామారావు వీరికి మంగళవాయిద్యాల నడుమ ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారి దర్శనం చేసుకుని మహామండపం 6 వ అంతస్తులో ఉన్న అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణు భట్ల శివప్రసాద శర్మ, ఇతర వైదిక సిబ్బంది, పూజలు నిర్వహించి వీరికి ఆశీర్వచనం అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణు భట్ల శివప్రసాద శర్మ, వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు, కార్యనిర్వాహక ఇంజినీర్లు,సహాయ కార్యనిర్వాహణాధికారి వార్లు ఇతర అన్ని విభాగముల సిబ్బంది పాల్గొన్నారు.