జనసేనాని పవన్ కళ్యాణ్ ను రేణుదేశాయ్ కలవబోతున్నారా..? ఈ మధ్య బయటకు వచ్చిన ఈ వార్త ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతోంది. వారిద్దరూ విడాకులు తీసుకుని ఎవరిదారుల్లో వారు పయనిస్తున్న తరుణంలో మళ్లీ ఎందుకు కలవవోతున్నారన్న చర్చ ప్రస్తుతం నడుస్తోంది…? ఇంతకీ వారిద్దరూ భేటీ అవటానికి గల కారణాలేంటో తెలుసుకోవాలనుకుంటే వాచ్ దిస్ స్టోరీ…
రేణుదేశాయ్ తో విడాకులు తీసుకుని ప్రస్తుతం అన్నా లెజీనోవాతో ఉంటున్న పవన్ కళ్యాణ్…అకీరాను, ఆద్యాను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అటు అన్నా లెజీనోవాను, ఇటు అకీరా, ఆద్యాలను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లి పరిచయం కూడా చేశారు. ఇక పవన్ గెలిచినపుడు సతీమణి లెజీనోవా, అకీరా లు చేసిన హడావిడి అంతా తెలిసిందే. మరోవైపు పవన్ సైతం డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తన శాఖలపై పట్టుసాధిస్తూ..మరోవైపు తన దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నారు.
మరోవైపు పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత మరొకరితో ఎంగేజ్మెంట్ చేసుకున్న రేణుదేశాయ్..కారణాలేమో తెలియదు కానీ పెళ్లి మాత్రం ఇంకా చేసుకోలేదు. తనకంటూ ఓ లైఫ్ ఉండాలని కోరుకుంటున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో రేణు దేశాయ్ స్పష్టం చేశారు. ఇక సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్న రేణుదేశాయ్…తన పిల్లల గురించి కానీ లేక పవన్ గురించి కానీ ప్రస్తావన వచ్చినపుడల్లా తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ చేతిలో ట్రోల్స్ గురైన సందర్భాలూ ఉన్నాయి. అదేవిధంగా వారి నుండి ప్రశంసలు పొందిన సంఘటనలు సైతం ఎన్నో ఉన్నాయి. ఇక అకీరా, ఆద్యాల బాగోగులు చూసుకుంటూ వారికి నచ్చిన కెరీర్ లో వాళ్లు సెటిలవుతారని రేణు స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గెలిచినపుడు సోషల్ మీడియా వేదికగా రేణుదేశాయ్ శుభాకాంక్షలు చెప్పి పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపారు.
ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమదైన కెరీర్స్ ను ఎంచుకుంటూ..ఎవరిదారుల్లో వారు పయనిస్తున్న తరుణంలో..ఇప్పుడు మళ్లీ పవన్, రేణు దేశాయ్ లు కలవబోతున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ లోఆసక్తిని రేపుతున్నాయి. ప్రస్తుతం భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కు ఛీఫ్ అడ్వయిజర్ గా ఉన్న రేణుదేశాయ్,పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై పలు రాష్ట్రాల ప్రముఖులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి సురేఖను ఇటీవల కలిసిన రేణుదేశాయ్…ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్యాత్మికంగా తీసుకుంటున్న చర్యల గురించి సురేఖ తో చర్చించారు. వారి ఇంట చక్కని ఆతిధ్యాన్ని స్వీకరించారు. ఆపై ఇప్పుడు ఏపీలో సైతం దేవాదాయశాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి తో రేణుదేశాయ్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం డివోషనల్ పరంగా తీసుకుంటున్న చర్యలపై తను పనిచేస్తోన్న ఫౌండేషన్ తరపున మంత్రి ఆనంతో ఆమె చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఏపీలో పర్యావరణ, అటవీ శాఖ బాధ్యతలను పవన్ చేపట్టిన నేపథ్యంలో పవన్ తో సైతం తన విధుల్లో భాగంగా రేణుదేశాయ్ కలవనున్నట్లు తెలుస్తోంది. సహజంగా ప్రకృతిని ఎంతో ఆరాధించే పవన్ , చేపట్టిన శాఖల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోన్న తరుణంలో…ఇప్పుడు రేణుదేశాయ్ ఇచ్చే సూచనలు, సలహాలను పాటించే అవకాశాలున్నాయి.
మొత్తంగా చట్టపరంగా విడాకులు తీసుకున్నా…పిల్లల కెరీర్ విషయంలో పవన్, రేణుదేశాయ్ లు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. తల్లి , తండ్రులుగా తాము విడిపోయినా ఆ ప్రేమలను మాత్రం వారికి దూరం కాకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఇక వృత్తిపరంగా వేర్వేరు బాధ్యతల్లో ఉన్న పవన్ , రేణుదేశాయ్ లు ఇప్పుడు కలుస్తున్నది కూడా ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇద్దరికీ సెలబ్రిటీ హోదా ఉన్న నేపధ్యంలో…వారికి సంబంధించిన ప్రతి వార్తా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది కాబట్టి వారి భేటీకి ఇంతకంటే ప్రయారిటీ ఉండబోదని స్పష్టం చేస్తున్నారు. సో..ఏదేమైనప్పటికీ ఇంతటి ఆసక్తిని రేకెత్తిస్తున్న వీరిద్దరి భేటీ ఎప్పుడు ఉండబోతోందో చూడాలి. ఎందుకంటే పవన్ కార్యాలయ వర్గాలు ఇంకా వీరిద్దరి భేటీని కన్ఫర్మ్ చేయటం లేదు కాబట్టి.