తిరుపతి నగర పౌరులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు కార్పోరేషన్ ఇవాళ సిటీలో 3కే రన్ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం స్వచ్ఛత-హి-సేవలో భాగంగా ఈ రన్ నిర్వహించారు. నగరంలోని వివేకానంద సర్కిల్ నుంచి ఎస్వీయూ ఆడిటోరియం వరకు ఈ రన్ జరిగింది. ఇందులో విద్యార్థులతో పాటు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య పాల్గొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పిలుపునిచ్చారు.