ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు ఎత్తిన పిడికిలి దించకుండా పోరాడుతాం:మాజీ ఎంపీ కవిత 

Spread the love

కరీంనగర్ గడ్డ మీద ప్రారంభించిన ఏ ఉద్యమమైన విజయవంతమవుతుందని  అదే కరీంనగర్ నుండి నేడు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం కోసం చేపట్టిన ఉద్యమం కూడా విజయవంతం అవుతుందని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉద్యమకారులతో కలిసి తెలంగాణ జాగృతి భూ పోరాటం చేశారు. కరీంనగర్ నుండి ప్రారంభం అయిన పోరాటం… రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉద్యమకారులను ఏకం చేసి పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు ఎత్తిన పిడికిలి దించకుండా పోరాడుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేంతవరకు ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని తెలిపారు.