వెండితెరపై నటుడిగా ఏఆర్ రెహమాన్… ప్రభుదేవా ‘మూన్‌వాక్’లో అదిరిపోయే సర్ ప్రైజ్!

Spread the love

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తన మూడు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో ఎప్పుడూ చేయని సరికొత్త సాహసానికి సిద్ధమయ్యారు. ప్రభుదేవా ప్రధాన పాత్రలో మనోజ్ ఎన్.ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మూన్‌వాక్’ (Moon Walk) చిత్రంతో ఆయన నటుడిగా ఆరంగేట్రం చేస్తున్నారు.ఈ సినిమాలో రెహమాన్ కేవలం అతిథి పాత్రకే పరిమితం కాకుండా, ఒక కల్పిత పాత్రలో ‘కోపమున్న యువ దర్శకుడి’గా కనిపించనున్నారు. విశేషమేమిటంటే, ఈ చిత్రంలోని మొత్తం ఐదు పాటలను రెహమానే స్వయంగా పాడారు.అయితే  ప్రభుదేవా, రెహమాన్ కాంబినేషన్ దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఈ చిత్రంలో యోగి బాబు మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు.ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌ను 2026 మే నెలలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.జనవరి 4న సత్యభామ యూనివర్సిటీలో ఈ చిత్ర ఆడియో లాంచ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహించనున్నారు.