400 ఏళ్ల సేవలకు వీడ్కోలు.. తపాలా సేవలను ముగించిన మొదటి  దేశంగా డెన్మార్క్

Spread the love

డెన్మార్క్ ప్రభుత్వం దేశంలోని పోస్టల్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలంతా  డిజిటల్ కమ్యూనికేషన్ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

దీంతో తపాలా సేవలను ముగించిన మొదటి  దేశంగా డెన్మార్క్ నిలిచింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘పోస్ట్ నార్డ్’ అనే సంస్థ అనేక సంవత్సరాలుగా పోస్టల్ సేవలు అందిస్తోంది. ప్రస్తుత ఫాస్ట్ యుగంలో అందరు  డిజిటల్ కమ్యూనికేషన్ వైపు మొగ్గు చూపుతుండడంతో లెటర్స్ కు ఆదరణ తగ్గిపోయింది. ఈ క్రమంలో వీటి సేవలను పూర్తిగా నిలిపేయాలని నిర్ణయించింది. అయితే ఆన్లైన్ షాపింగ్ లపై  ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్న క్రమంలో పార్సిల్ సర్వీసులను మాత్రం కొనసాగించనున్నట్లు పోస్ట్ నార్డ్  అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే దేశంలోని రెడ్ మెయిల్ బాక్స్ లను ప్రభుత్వం తొలగిస్తూ వస్తోంది. జూన్ నుంచి ఇప్పటివరకు దాదాపు 1,500 మెయిల్ బాక్స్లను తొలగించింది. డిసెంబరులో వీటిని స్వచ్ఛంద సంస్థల కోసం విక్రయించింది. అయితే వీటిని డెన్మార్క్ ప్రజలు సైతం కొనుగోలుకు ఆసక్తి చూపించారు. పోస్టల్ సేవలు నిలిపివేసినా ఇంకా లెటర్స్  రాసి పంపే వారి కోసం మాత్రం డావో అనే ప్రైవేటు కొరియర్ సర్వీసును వినియోగించాలని నిర్ణయించింది.