మాస్ మహారాజ్ రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుండి సాంగ్ ప్రోమో విడుదల!

Spread the love

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఇందులో రవితేజకు జోడిగా ఆషికా రంగనాథ్ , డింపుల్ హయాతీనటిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రచార చిత్రాల్లో భాగంగా తాజాగా ఈ మూవీ నుండి ‘వామ్మో.. వాయ్యో..’ అంటూ సాగే మాస్ మసాలా లిరికల్ సాంగ్ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫుల్ సాంగ్‌ను కొత్త ఏడాది కానుకగా జనవరి 2న రిలీజ్ చేయబోతున్నారు. ‘ధమాకా’ వంటి మ్యూజికల్ హిట్ తర్వాత భీమ్స్ సిసిరోలియా మరోసారి రవితేజ కోసం అదిరిపోయే ట్యూన్స్ అందించారు. ప్రోమోలో రవితేజ డ్యాన్స్ స్టెప్పులు చూస్తుంటే థియేటర్లలో రచ్చ ఖాయమనిపిస్తోంది.కిషోర్ తిరుమల మార్క్ ఎమోషన్స్ ,రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ కలగలిసిన ఈ చిత్రం సంక్రాంతి రేసులో గట్టి పోటీని ఇచ్చేలా కనిపిస్తోంది.