పవన్ కల్యాణ్ – సురేందర్ రెడ్డి క్రేజీ ప్రాజెక్ట్ షురూ…!

Spread the love

కొత్త ఏడాది సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే వార్త వినిపించింది.పవన్ కెరీర్‌లో 32వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించబోతున్నారు.ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత రామ్ తాళ్ళూరి తన కొత్త బ్యానర్ ‘జైత్ర రామ మూవీస్’ పై ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మించనున్నారు.విశేషమేమిటంటే,ఈ బ్యానర్ కు పవన్ కళ్యాణ్  ‘జైత్ర రామ మూవీస్’ అనే పేరును సూచించినట్లు సమాచారం.సురేందర్ రెడ్డి-వక్కంతం వంశీ ద్వయం గతంలో ‘కిక్’, ‘రేసుగుర్రం’ వంటి బ్లాక్ బస్టర్స్ చిత్రాలను అందించిన నేపథ్యంలో, పవన్ కోసం వక్కంతం వంశీ పక్కా కమర్షియల్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం పవన్ అభిమానులకు ఒక స్టైలిష్ యాక్షన్ ట్రీట్ లా ఉండబోతోందని మేకర్స్ స్పష్టం చేశారు.మరోవైపు పవన్ కల్యాణ్ చేతిలో ఇప్పటికే మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి.కొత్త ఏడాది సందర్భంగా సురేందర్ రెడ్డి సినిమా ప్రకటన రావడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, పవన్ తన షూటింగ్ షెడ్యూల్స్‌ను పక్కాగా ప్లాన్ చేస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.ఈ కొత్త సినిమా షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.