ప్రపంచం గత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ సరికొత్త ఆశలతో ప్రపంచం కొత్త సంవత్సరంలో కి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
‘నూతన సంవత్సరం సందర్భంగా దేశంలో, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కొత్త ఏడాది కొత్త శక్తి, సానుకూల మార్పులకు ప్రతీక. ఆత్మపరిశీలనకు, కొత్త సంకల్పాలు తీసుకొనేందుకు మంచి అవకాశం. ఈ సందర్భంగా దేశాభివృద్ధి, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణపై మన నిబద్ధతను చాటుకుందాం. ఈ 2026 మనందరి జీవితాల్లో శాంతి, సంతోషం తీసుకురావాలని.. మరింత బలైమన, సుసంపన్నమైన భారత నిర్మాణానికి కొత్త శక్తిని నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు.
2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరికీ శాంతి, ఆరోగ్యం, ఆనందం శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నా. పటిష్టమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే మన సమష్టి సంకల్పాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
ఈ సంవత్సరం అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. 2026లో మీ అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని.. మంచి ఆరోగ్యం, శ్రేయస్సు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నా. సమాజం శాంతి, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాఅంటూ దేశ ప్రజలకు ప్రధాని మోదీ తన శుభాకాంక్షలు తెలిపారు.