మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ విడుదల తేదీ ఖరారు!

Spread the love

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 4, 2026న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.ఈ వేడుకను ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.ఇప్పటికే భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ట్రైలర్ తో మెగా మేజిక్ రిపీట్ కావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా, క్యాథరిన్ థ్రెసా, సునీల్, సచిన్ ఖేడేకర్ వంటి భారీ తారాగణం అలరించనుంది.ఇక ఈ చిత్రంలో ఓ ప్రత్యేకమైన అతిథి పాత్రలో తెలుగు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారు.షైన్ స్క్రీన్స్,గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12, 2026న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. వినోదం మరియు ఎమోషన్స్ కలగలిసిన పక్కా అనిల్ రావిపూడి మార్క్ సినిమాగా ఇది ఉండబోతోంది.