శ్రీశైలం పాతాళ గంగ మెట్ల మార్గంలో చిరుత హాల్ చల్  

Spread the love

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది.  శ్రీశైలం పాతాళ గంగ మెట్ల మార్గంలో పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో అర్ధరాత్రి చిరుత పులి ప్రవేశించింది చిరుత పులి దృశ్యాలు సీసీ కెమెరా లో రికార్డయ్యాయి. వీటిని చూసిన కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు తాము రాత్రిపూట వరండాలో పడుకొని ఉంటే తమపై దాడి చేసేదేమోనని భయాందోళనకు గురయ్యారు  గత సంవత్సరం కూడా పూజారి సత్యనారాయణ ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించింది అప్పుడు కూడా సీసీ కెమెరాలు చిరుత పులి దృశ్యాలు రికార్డ్ అయినవి మళ్లీ నూతన సంవత్సరం అదే జనవరిలో మళ్లీ పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంట్లోకి అర్ధరాత్రి మళ్లీ చిరుత పులి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి చిరుతపులి పలుమార్లు తరచూ క్షేత్రం పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడో ఒకచోట చిరుత పులి సంచారాన్ని తాము చూసామంటూ స్థానికులు చెబుతున్నారు అయితే ఈవిషయంపై అటవీశాఖ అధికారులు,దేవస్థానం అధికారులు చిరుపులి తిరుగుతున్న ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో స్థానికులు,భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు మరోపక్క అటవీ ప్రాంతం దగ్గరలోనే ఉండడంతో చిరుత పులులు పలుమార్లు సంచరించడం పరిపాటిగా మారింది.