మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddi) నుండి రెండో పాట కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు.అయితే మొదటి పాట ‘చికిరి చికిరి’ ఇప్పటికే 150 మిలియన్లకు పైగా వ్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు రెండో సింగిల్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోందని సమాచారం.
కాగా ఈ పాట సుమారు 500 మంది డ్యాన్సర్లతో అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించిన పక్కా మాస్ నంబర్ అని, ఇందులో రామ్ చరణ్ స్టెప్పులు , జాన్వీ కపూర్ గ్లామర్ హైలైట్‌గా ఉండబోతున్నాయని తెలుస్తోంది.ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ & మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.