బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని అక్రమంగా చేజిక్కించుకున్న శక్తులు మైనారిటీలైన హిందువులు మరియు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు. రాడికల్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హదీ మరణం తర్వాత దేశంలో చెలరేగిన హింసలో హిందూ దేవాలయాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయని, ఇప్పుడు ఆ సెగ క్రైస్తవులకు కూడా పాకిందని అవామీ లీగ్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా క్రిస్మస్ పండుగ వేళ చర్చిలు, మిషనరీ పాఠశాలలకు బెదిరింపు లేఖలు పంపడం, వారిని ‘ఇస్లాం వ్యతిరేకులు’గా ముద్ర వేయడం వంటి చర్యలు దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాయని హసీనా మండిపడ్డారు. దేశ రక్షణ కోసం, మైనారిటీల ప్రాణాలను కాపాడుకోవడం కోసం బంగ్లా ప్రజలందరూ ఏకం కావాలని ఆమె తన నూతన సంవత్సర సందేశంలో పిలుపునిచ్చారు.
హిందువులు, క్రైస్తవులే టార్గెట్: షేక్ హసీనా