దీర్ఘకాలిక రైల్వే  డిమాండ్‌లకు అనుమతి లభించినందుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం 

Spread the love

శ్రీకాకుళం జిల్లా వాసుల దీర్ఘకాలిక రైల్వే  డిమాండ్‌లకు నేడు అనుమతి లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.   శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యం, అనుసంధానం, రోజువారీ ప్రయాణ సౌలభ్యానికి  ఉపయోగపడేలాగా నేడు రైల్వే శాఖ జిల్లాలోని కీలక రైల్వే స్టేషన్ లలో హల్ట్ లు మంజూరు చేసారని తెలిపారు. ప్రజా ప్రయోజనాన్ని ప్రధానంగా తీసుకుని, ఈ అంశంపై ఈ విషయంపై తాను  ఎంతోకాలంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సానుకూలంగా స్పందించి సహకరించినందుకు ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి, అలాగే రైల్వే అధికారులకు  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం శ్రీకాకుళం జిల్లాకు మెరుగైన రైలు సౌకర్యాలు, అభివృద్ధి దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. 

మంజూరైన రైళ్ల హల్ట్ వివరాలు: 

• పూరి–అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ – ఇచ్చాపురం వద్ద

• బెరంపూర్–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ – తిలారు వద్ద

• భువనేశ్వర్–న్యూ విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ – బారువ వద్ద

ఈ అన్ని రైలు హల్ట్ లు  త్వరలోనే అమలులోకి రానున్నాయి.