తల్లిదండ్రులకు వాట్సాప్ లో ఇంటర్ స్టూడెంట్స్ హల్ టికెట్స్

Spread the love

తెలంగాణాలో ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ స్టూడెంట్స్ కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక  నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్స్   హాల్ టిక్కెట్లను వారి తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా పంపనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.హాల్ టిక్కెట్లను వాట్సాప్ చేయడం ద్వారా వాటిలో ఏవైనా పొరపాట్లు ఉంటే పరీక్షలకు ముందే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఎగ్జామ్స్ కు  2 నెలల ముందే తల్లిదండ్రులకు హాల్ టిక్కెట్లను వాట్సాప్ చేయనున్నట్లు తెలిపారు. చాలా మంది తల్లిదండ్రుల వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.స్టూడెంట్స్ తల్లిదండ్రులు హాల్ టిక్కెట్‌లో ముద్రించిన వివరాలను మొత్తం  పరిశీలించి ఏమైనా తప్పులుంటే సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌కు తెలియజేయాలని ఇంటర్ బోర్డు సూచించింది.