పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి రూపొందిస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ఈ సంక్రాంతికి (జనవరి 9, 2026) థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లతో పాటు కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ నటిస్తున్నారు.ఈ మేరకు సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న మాళవిక, ప్రభాస్‌తో తనకున్న ఒక ఆసక్తికరమైన అనుబంధాన్ని పంచుకున్నారు.
నిజానికి ప్రభాస్‌తో మాళవికకు ఇది మొదటి సినిమా,అయితే ఆమెకు అంతకుముందే ఒక భారీ అవకాశం వచ్చిందని…ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘సలార్’ (Salaar) లో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా మాళవికనే సంప్రదించారని చెప్పారు. విజయ్ ‘మాస్టర్’ సినిమా చూసిన ప్రశాంత్ నీల్, ఆమెను బెంగళూరు పిలిపించి ఫోటోషూట్ కూడా చేశారని, అయితే కొన్ని సాంకేతిక కారణాల వలన నటించలేకపోయాను అని తెలిపింది.ఆ సమయంలో ప్రభాస్ లాంటి పెద్ద స్టార్‌తో అవకాశం మిస్ అయినందుకు చాలా బాధపడ్డానని, కానీ విధి మళ్ళీ తనను ‘రాజా సాబ్’ రూపంలో ప్రభాస్ దగ్గరికే చేర్చిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.ఈ సినిమాలో తాను ‘భైరవి’ అనే గ్లామరస్ & వైబ్రెంట్ పాత్రలో కనిపిస్తానని, తనలోని అన్ని కోణాలను ఆవిష్కరించే రోల్ ఇదని ఆమె పేర్కొన్నారు.