విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’ రిలీజ్ డేట్ ఖరారు!

Spread the love

దశాబ్దాల క్రితం కమల్ హాసన్ ‘పుష్పక విమానం’తో సృష్టించిన మూకీ చిత్ర ప్రభంజనాన్ని గుర్తుచేస్తూ, తాజాగా విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినూత్న ప్రయోగంగా తెరకెక్కిన ఈ మూకీ డ్రామాను గాంధీజీ వర్ధంతి సందర్భంగా జనవరి 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు జీ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది.అయితే మాటలు లేని ఈ చిత్రంలో కేవలం నటీనటుల హావభావాలే ప్రధానం కాగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ కథకు ప్రాణవాయువులా నిలవనుందని సమాచారం. కిషోర్ పి. బేలేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.ఈ మూవీని ఉమేష్ కుమార్ బన్సల్, రాజేష్ కేజ్రీవాల్, మీరా చోప్రా, కిషోర్ పాండురంగ్ బేలేకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని అద్భుతమైన విజువల్స్‌తో, మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్‌గా థియేటర్లలో ఆవిష్కరించబోతున్నారు. ఇది ఏ భాషా హద్దులు లేని చిత్రమైనప్పటికీ, తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.