శ్రీవిష్ణు బాక్సాఫీస్ జోరు…చేతిలో ఐదు క్రేజీ ప్రాజెక్టులు!

Spread the love

సహజమైన నటన, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ సృష్టించుకున్న హీరో శ్రీవిష్ణు, ప్రస్తుతం కెరీర్ పరంగా గోల్డెన్ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.’సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’, ‘సింగిల్’ వంటి వరుస హిట్లు ఆయనను కంటెంట్ బేస్డ్ కామెడీ హీరోగా నిలబెట్టాయి.ప్రస్తుతం శ్రీవిష్ణు చేతిలో ఏకంగా 5 సినిమాలు ఉన్నాయి.అందులో ‘మృత్యుంజయ్’, ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రాలు షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధమవుతుండగా, ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజుతో మరో భారీ ప్రాజెక్ట్ మార్చిలో సెట్స్‌పైకి వెళ్లనుంది.వీటితో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో దర్శకుడు సన్నీ సంజయ్‌తో ఒక ఎంటర్‌టైనర్, గీతా ఆర్ట్స్ నిర్మాణంలో మరో కొత్త సినిమాకు శ్రీవిష్ణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఇలా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ శ్రీవిష్ణు బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తున్నారు. రాబోయే రెండేళ్లలో ఆయన తన మార్కెట్ స్థాయిని మరింత పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.