బాలీవుడ్ ఐకానిక్ ఫ్రాంచైజీ ‘డాన్’ (Don) చుట్టూ ప్రస్తుతం సంచలన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.షారుఖ్ ఖాన్ తప్పుకున్నాక, ‘డాన్ 3’ పగ్గాలు రణ్‌వీర్ సింగ్ అందుకుంటారని అంతా భావించగా.. తాజా సమాచారం ప్రకారం ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.గతేడాది ‘ధురంధర్’తో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన రణ్‌వీర్, తన కెరీర్ ప్లానింగ్‌లో భాగంగా వరుస యాక్షన్ చిత్రాలు వద్దు అనుకోవడం లేదా క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాగా దర్శకుడు ఫర్హాన్ అక్తర్, ఈ పాత్ర కోసం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.‘ధూమ్ 2’, ‘వార్’ వంటి చిత్రాల్లో తన స్టైలిష్ యాక్షన్‌తో మెప్పించిన హృతిక్, డాన్ పాత్రకు సరైన న్యాయం చేయగలరని చిత్రబృందం నమ్ముతోంది. గతంలో ‘డాన్ 2’లో ఒక చిన్న గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన హృతిక్, ఇప్పుడు పూర్తిస్థాయి డాన్‌గా కనిపిస్తే అది బాక్సాఫీస్ వద్ద పెను సంచలనమే అవుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.