భోగాపురం ఎయిర్ పోర్ట్ లో మొదటి విమానం విజయవంతంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఘనత తమదంటే తమదని అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశామని జగన్ తెలిపారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయిందని స్పష్టం చేశారు. . ఆ రోజు తాము చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచిందన్నారు. అయితే దీనిపై టీడీపీ అగ్రనేత, మంత్రి లోకేష్ మరో రకంగా స్పందించారు. భోగాపురం ఎయిర్ పోర్టు అడ్డుకున్న ఘనత ముమ్మాటికీ జగన్ దే! అని వైసీపీకి సిగ్గుండాలి కాస్త చెప్పుకోవడానికి! అంటూ జగన్ గతంలో మాట్లాడిన వీడియోను తన సోషల్ మీడియా ‘ఎక్స్’ అకౌంట్ లో పోస్ట్ చేశారు.