సోమనాథ్ వెయ్యేళ్ల ప్రతిఘటనకు ప్రతీక :- ప్రధాని మోదీ

Spread the love

సోమనాథ్ దేవాలయంపై జరిగిన మొదటి దాడికి 2026 నాటికి వెయ్యి ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో ఆలయం చరిత్ర గురించి పోస్ట్ చేశారు. ఎన్నిసార్లు దాడులు జరిగినా సోమనాథ్ క్షేత్రం నేటికీ సగర్వంగా నిలిచి ఉండటం వెనుక భారతమాత ముద్దుబిడ్డల విచ్ఛిన్నం చేయలేని ధైర్యం ఉందని ఆయన కొనియాడారు.మన సంస్కృతిని, నాగరికతను కాపాడటం కోసం ప్రజలు చేసిన త్యాగాలకు సోమనాథ్ కథ ఒక నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. విధ్వంసం కంటే సృజన శక్తి ఎప్పుడూ గొప్పదని, భక్తి , విశ్వాసాన్ని ఏ శక్తీ అణచివేయలేదని ఈ క్షేత్రం నిరూపిస్తోందని ఆయన వివరించారు.ఈ వెయ్యేళ్ల ప్రస్థానం కేవలం ఒక కట్టడం గురించి కాదని, ఇది భారతీయుల ఆత్మగౌరవానికి , అలుపెరగని పోరాట పటిమకు ప్రతీక అని ప్రధాని తన పోస్ట్ లో ఉద్ఘాటించారు. సోమనాథ్ పునరుద్ధరణ అనేది మన దేశ పునరుజ్జీవనానికి చిహ్నమని మోదీ పేర్కొన్నారు