తెలంగాణ రాష్ట్రంలో మరొక రాజకీయ వేదిక రానుంది. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ జాగృతి’.. రాజకీయ పార్టీగా మారుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నానని.. రాజకీయ శక్తిగా తిరిగివస్తానని ఆమె అన్నారు. అన్ని బంధనాలు తెంచుకుని వస్తున్నానని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు. బీ.ఆర్.ఎస్. నుంచి దూరమైన తరువాత నుంచి ఆమె రాజకీయంగా మరింత యాక్టివ్ గా మారారు. పలు ప్రజాపోరాటాల్లో పాలుపంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా రానున్న ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు తెలుపుతూ ఆమె అభిమానుల్లో జోష్ నింపారు.