సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సుమారు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘వారణాసి’ మరో సంచలనానికి సిద్ధమైంది.ఈ సినిమా టీజర్ గ్లింప్స్‌ను పారిస్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘లే గ్రాండ్ రెక్స్’ (Le Grand Rex) ఆడిటోరియంలో ఈరోజు రాత్రి 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.ఒకవేళ ఇదే నిజమైతే, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ నిలుస్తుంది.గతంలో విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో చూపించిన దాని బట్టి చుస్తే వారణాసి మణికర్ణిక ఘాట్, అంటార్కిటికా, త్రేతాయుగం నాటి లంకా నగరం వంటి విజువల్స్ చూస్తుంటే, ఇది భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను కలిపే ఒక అద్భుతమైన టైమ్ ట్రావెల్ & మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోంది.
ముఖ్యంగా మహేష్ బాబు నందిపై కూర్చుని త్రిశూలంతో కనిపించిన రౌద్ర రూపం సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది.ప్రియాంకా చోప్రా హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు.ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా, శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ & ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ గ్లోబల్ వండర్‌ను 2027 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారు.